కాణిపాకంలో భాను ప్రకాష్ రెడ్డి
CTR: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారిని తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు శేషవస్త్రం చిత్రపటాన్ని దేవస్థానం ఛైర్మన్ మణి నాయుడు, ఈ.వో పెంచల కిషోర్ అందించారు.