జాతీయ లోక్అదాలత్ జూలై 5కు వాయిదా

ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా మే 10వ తేదీన నిర్వహించాల్సిన జాతీయ లోక్ ఆదాలత్ కార్యక్రమాన్ని జూలై 5వ తేదీకి వాయిదా వేశారు. ఈ విషయాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ పి.యామిని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల నుంచి సమాచారం అందిందని జిల్లా కార్యదర్శి జర్జి బాబా ఫక్రుద్దీన్ పేర్కొన్నారు.