'అటవీ భూముల ఆక్రమణకు పాల్పడితే కఠిన చర్యలు'
MNCL: అటవీ భూముల ఆక్రమణకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లా కార్యాలయంలో సంబంధిత అధికారులు బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్‌తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. సరైన అనుమతులు లేకుండా అటవీ భూములను ఆక్రమించినా, వృక్షాలను నరికినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.