గొంతులో అన్నం ముద్ద ఇరుక్కుని వ్యక్తి మృతి..!
RR: షాబాద్ మండల కేంద్రంలో అన్నం తింటుండగా గొంతులో ముద్ద ఇరుక్కుని చిల్కమర్రి జంగయ్య అనే వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. షాబాద్ సర్పంచ్ గుండాల అశోక్, ఉప సర్పంచ్ దండు రాహుల్, మాజీ జడ్పీటీసీ జడల రాజేందర్ గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.