పాఠశాలను తనిఖీ చేసిన డీఈఓ

SRD: జిల్లాలోని ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులు చదువుతున్న తీరును, ఉపాధ్యాయులు బోధన చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. డీఈఓ మాట్లాడుతూ.. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.