25న హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన
ADB: గాదిగూడ మండలంలోని పూనగూడలో గ్రామస్థులు నూతన హనుమాన్ మందిరాన్ని నిర్మించారు. ఈనెల 25వ తేదీన ఆలయంతో పాటు హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.