సురవరం సుధాకర్ రెడ్డి మృతిపై మాజీ MLA దిగ్భ్రాంతి

సురవరం సుధాకర్ రెడ్డి మృతిపై మాజీ MLA దిగ్భ్రాంతి

NLG: కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతం కోసం పనిచేసిన సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ MP సురవరం సుధాకర్ రెడ్డి ఇకలేరని శనివారం నల్గొండ మాజీ MLA కంచర్ల భూపాల్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన ఆస్తులను ప్రజలకు దత్తం చేసి ప్రజాసేవలో నిమగ్నమైన నిబద్ధత గల నేతగా, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి ఆశాజ్యోతిగా సురవరం సుధాకర్ రెడ్డి చరిత్రలో నిలిచి పోయారని ఆయన అన్నారు.