రేపు జిల్లాలో గిరిజన దర్బార్ కార్యక్రమం
BDK: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో రేపు గిరిజన దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఆదివారం ప్రకటించారు. గిరిజనులు తమ సమస్యలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదులు అందజేయాలని కోరారు. ఐటీడీఏ యూనిట్ అధికారులు ఉదయం 10:30 గంటలకే సమావేశ మందిరానికి విధిగా హాజరుకావాలని ఆయన ఆదేశించారు.