బాలుడు అదృశ్యం..!

VKB: కుల్కచర్ల మండలం బొంరెడ్డిపల్లికి చెందిన సిద్ధార్థ(16) అదృశ్యమయ్యాడు. దండు శ్యామలమ్మ కుమారుడు సిద్ధార్థ చిన్న అంతారంలో పిన్ని పద్మమ్మ వద్ద ఉంటూ పుట్టపహాడ్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. బొంరెడ్డిపల్లిలో గ్రామానికి అంతారం నుంచి బుధవారం సాయంత్రం సిద్ధార్థ సైకిల్‌పై బయలుదేరాడు. రాత్రి అయిన ఇంటికి చేరుకోకపోవడంతో శ్యామలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయ్యగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.