'వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి'
ADB: ప్రభుత్వాలు నిర్వహించే వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డా.చరిత్ అన్నారు. సోమవారం ఇచ్చోడ మండలంలోని బోరిగాంలో పీఎం జన్మన్ ఉచిత వైద్య శిభిరాన్ని ఏర్పాటు చేశారు. చలికాలం నేపథ్యంలో రోగులకు వైద్య పరీక్షలు చేసి మందులు అందజేశారు. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచితే జ్వరాలు రాకుండా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉమా, సుమతి, సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.