VIDEO: తప్పిన దిత్వా ముప్పు.. ఊపిరి పీల్చుకున్న రైతులు
KKD: దిత్వా తుఫాన్ ముప్పు తప్పడంతో వరి రైతులు ఊపిరి పీల్చుకున్నారు. మరో 10 రోజుల్లో వరి కోతలు ప్రారంభమవుతాయనుకునే తరుణంలో దిత్వా తుఫాను హెచ్చరికలు రైతులను ఆందోళనకు గురిచేశాయి. కోటనందూరులో తుఫాన్ ప్రభావం పెద్దగా కనిపించకపోవడంతో అన్నదాతలు ఊపిరి పీల్చుకున్నారు. మండల పరిధిలో 13,600 ఎకరాల్లో అన్నదాతలు వరి సాగు చేస్తున్నారు.