తిరుమల శ్రీవారి సేవలో జయం రవి, కెనిషా

తిరుమల శ్రీవారి సేవలో జయం రవి, కెనిషా

తిరుమల శ్రీవారిని తమిళ నటుడు జయం రవి తన స్నేహితురాలు కెనిషాతో దర్శించుకున్నాడు. ఇవాళ VIP బ్రేక్ దర్శన సమయంలో స్వామి వారి సేవలో వారిద్దరూ పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. కాగా, గతంలో జయం రవి, కెనిషా ప్రేమలో ఉన్నట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే.