యువత సద్వినియోగం చేసుకోవాలి: తహసీల్దార్

KDP: భారత్ ఎన్నికల సంఘం ఓటు నమోదుకు అవకాశం కల్పించిందని, 18 సంవత్సరాలు వయసున్న ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవచ్చని తహశీల్దార్ రమణమ్మ తెలిపారు. ఈ అవకాశాన్ని యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఓటు నమోదు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయని ఓటు నమోదుకు ముందుకు రావాలన్నారు.