రోడ్ల మరమ్మత్తుల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన

రోడ్ల మరమ్మత్తుల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన

AKP: అనకాపల్లిలో ఆర్ అండ్ బి శాఖ రోడ్ల మరమ్మతుల్లో విఫలమైందని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు అన్నారు. బుధవారం ఆందోళన చేపట్టారు. శారదనగర్, రైల్వే స్టేషన్, తుమ్మపాల, భజనకొండ రహదారులు గోతులతో చెరువుల్లా మారాయని తెలిపారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా చర్యలు లేవన్నారు. రాత్రివేళ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు.