పెరుగుతున్న ఉష్ణోగ్రతలు..జర జాగ్రత్త

రంగారెడ్డి: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్దలో 41.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మెయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో 41.2 డిగ్రీలు, రెడ్డిపల్లిలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే మూడు రోజుల్లో 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగే ఆస్కారం ఉందని వాతవారణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.