ఫ్యాక్టరీల్లో అగ్నిమాపక డెమో
ATP: అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా అనంతపురంలోని సప్తగిరి క్యామ్ ఫర్, సిప్లాన్ ఫ్యాక్టరీల్లో అగ్నిమాపక శాఖ డెమో నిర్వహించింది. జిల్లా అగ్నిమాపక అధికారి వి.శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ప్రమాదం జరిగినప్పుడు సిబ్బంది స్పందించే తీరు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను క్షుణ్ణంగా వివరించారు.