నేడు జిల్లాకు ఒడిశా గవర్నర్
VZM: ఒడిశా రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు బుధవారం కొత్తవలస మండలం మంగళపాలెం రానున్నట్లు జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయ వర్గాలు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. శ్రీ గురుదేవా ఛారిటబుల్ ట్రస్ట్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. ఆనంతరం ఆసుపత్రిని సందర్శిస్తారు. రాష్ట్ర గవర్నర్ రానుండడంతో పోలీస్ భద్రత ఏర్పాట్లను కట్టుదిట్టం చేస్తున్నారు.