VIDEO: జర్నలిస్ట్ కిడ్నాప్.. తీవ్ర కలకలం
బాగ్దాద్‌లో అమెరికన్ జర్నలిస్ట్ షెల్లీ కిటెల్సన్ కిడ్నాప్ అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. ఇరాన్ మద్దతు ఉన్న 'కతైబ్ హెజ్బల్లా' ముఠా ఈమెను కిడ్నాప్ చేసినట్లు అమెరికా పేర్కొంది. పారిపోయే క్రమంలో వాహనం బోల్తా పడటంతో ఇరాక్ దళాలు ఒకరిని అరెస్ట్ చేశాయి. యుద్ధ ప్రాంతాలపై లోతైన అవగాహన ఉన్న ఆమెను సురక్షితంగా విడిపించేందుకు అమెరికా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.