పాలకుర్తి స్మృతి వనాన్ని సందర్శించిన కలెక్టర్

JN: పాలకుర్తి సోమేశ్వర ఆలయానికి సమీపంలో ఉన్న స్మృతి వనాన్ని గురువారం కలెక్టర్ సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. స్మృతి వనం పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచాలని, ఆలయానికి వచ్చే భక్తులు సందర్శించి కాసేపు గడిపే విధంగా తీర్చి దిద్దాలన్నారు. విద్యుత్, సీసీ కెమెరాలు, పిల్లల ఆట వస్తువులు,తదితర మౌలిక వసతుల ఏర్పాటుకు సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు