ఘనంగా బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

MNCL: బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని చెన్నూరు పట్టణ పార్టీ కార్యాలయంపై పట్టణ అధ్యక్షుడు తుమ్మ శ్రీపాల్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1980 ఏప్రిల్ 6న వాజ్పేయి, అద్వానీల సారథ్యంలో BJP ఆవిర్భవించిందని ఆయన తెలిపారు. కేవలం 2 లోక్ సభ స్థానాలతో ప్రారంభించిన బీజేపీ, నేడు వరుసగా 3వ సారి కేంద్రంలోకి రావడం గర్వకారణం అన్నారు.