'గ్రామాలలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలి'

'గ్రామాలలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలి'

VZM: ప్రతి గ్రామంలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని డివిజనల్ పంచాయతీ అధికారి శిరీషరాణి అన్నారు. సోమవారం బొండపల్లి మండలంలోని అంబటివలస, బొండపల్లి గ్రామాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామాల్లో చెత్త పెంట కుప్పలు తొలగించాలని, మురుగు కాలవల్లో పూడికలు తీయించాలని, వీధిలైట్లు అన్ని వెలిగేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు.