ఏకంగా స్మశానవాటికలోనే వ్యభిచారం..!

ఏకంగా స్మశానవాటికలోనే వ్యభిచారం..!

HYD: బేగంపేటలో స్మశాన వాటికను అడ్డాగా చేసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. శ్యామ్ లాల్ బిల్డింగ్స్ సమీపంలోని శ్మశానంలో ఈ దందా జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో నిర్వాహకురాలు మాధవితో పాటు మరో యువతి, ఒక విటుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.