ఆలయాల్లో తొక్కిసలాటలు.. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు
AP: ఆలయాల్లో తొక్కిసలాట ఘటనల నివారణపై ప్రభుత్వం దృష్టి సారించింది. అయితే భవిష్యత్తులో తొక్కిసలాట జరగకుండా పర్యవేక్షణకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు. YCP హయాంలో ఆలయాలపై దాడులు, తీసుకున్న చర్యలు పర్యవేక్షించాలని CM ఆదేశించారు. ముగ్గురు మంత్రులతో మంత్రివర్గం ఉపసంఘం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సభ్యులుగా మంత్రులు ఆనం, అనిత, అనగానిని నియమించారు.