భారత్ టాక్సీ సేవలు ప్రారంభం
భారత్ టాక్సీ ప్రయోగాత్మక సేవలు ఢిల్లీ, గుజరాత్‌లో ప్రారంభమయ్యాయి. ఓలా, ర్యాపిడో, ఉబర్ మాదిరిగా.. ఆటోలు, బైక్స్, కార్ల ద్వారా ప్రయాణానికి బుక్ చేసుకునే వీలుంటుంది. ఇప్పటివరకు 51 వేల మందికిపైగా డ్రైవర్లు.. ఈ యాప్‌లో రిజిస్టర్ చేసుకున్నారు. ఈ డిజిటల్ యాప్‌ను సహకార్ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ నిర్వహిస్తోంది. పూర్తిస్థాయిలో డిసెంబర్‌లో అందుబాటులోకి రానున్నాయి.