ఆత్మకూరులో కార్డాన్ సెర్చ్ నిర్వహణ

ఆత్మకూరులో కార్డాన్ సెర్చ్ నిర్వహణ

నెల్లూరు జిల్లాని ఆత్మకూరులో బిలాల్ మసీద్ పరిసరాలు, గుర్రాల వీధిలో పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటి తనిఖీలు చేసి కొత్త వ్యక్తుల వివరాలు సేకరించారు. సీఐ గంగాధర్ మాట్లాడుతూ.. వాహనాల పత్రాలు పరిశీలించి నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ఆన్‌లైన్ మోసాలు, చైన్ స్నాచింగ్, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు.