ఈ నెల 5న చోడవరంలో మెగా జాబ్ మేళా
AKP: చోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఈ నెల 5న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఎస్. గోవిందరావు తెలిపారు. పది, ఇంటర్, డిగ్రీ, ఐటిఐ, డిప్లమో, పీజీ చేసి 18 నుంచి 35 ఏళ్ల వయసు గల అభ్యర్థులు అర్హులుగా పేర్కొన్నారు. 18 కంపెనీలు వస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు naipunyam.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలన్నారు.