VIDEO: మాస్ కాపీయింగ్‌కు పాల్పడ్డ విద్యార్థులు
HYD: మలక్ పేట్ MS కాలేజీ విద్యార్థులు మాస్ కాపీయింగ్‌కు పాల్పడ్డారు. ఏకంగా పుస్తకాలు, ఫోన్లు ముందు పెట్టుకుని పరీక్షలు రాస్తున్నారు. స్క్వాడ్ వస్తున్నారనే సమాచారంతో నోట్ బుక్స్‌ను, స్లిప్స్‌ను కిటికిలోంచి విసిరేయడంతో అవి రోడ్డు మీద వెళ్లేవారిపై పడ్డాయి. దీనిని వాహనదారులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో కాలేజీ యాజమాన్యంపై విమర్శలు వస్తున్నాయి.