నేడు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ
NGKL: లింగాల మండల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను నేడు ఉదయం 11 గంటలకు పంపిణీ చేయనున్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ చేతుల మీదుగా మొత్తం 65 మందికి ఈ చెక్కులు అందజేయనున్నట్లు మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొత్త నాగేశ్వరరావు తెలిపారు. లబ్ధిదారులందరూ సకాలంలో హాజరు కావాలని కోరారు.