జనసేన కార్యకర్త కుటుంబానికి చెక్కు అందజేత

జనసేన కార్యకర్త కుటుంబానికి చెక్కు అందజేత

కృష్ణా: మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన క్రియాశీలక సభ్యుల చెక్కుల పంపిణీ కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో గుడివాడకు చెందిన క్రాంతి కుమార్ గత సంవత్సరం మరణించగా ఆయన భార్య నాగలక్ష్మికి రూ.5 లక్షల చెక్కును ఎమ్మెల్సీ హరి ప్రసాద్ చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో జిల్లా జనసేన అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ, శ్రీకాంత్ పాల్గొన్నారు.