'శెనగ రైతులకు ఇవ్వాల్సింది కొండంత.. ఇచ్చింది గోరంత'
KDP: జిల్లాలో బుడ్డ శెనగల రైతులకు ప్రభుత్వం ఇవ్వాల్సింది కొండంత, ఇప్పటివరకు ఇచ్చింది గోరంత అని కాంగ్రెస్ తులసి రెడ్డి ఆవేదన వెలిబుచ్చారు. మంగళవారం వేంపల్లెలో ఆయన మాట్లాడుతూ.. గత ఫిబ్రవరి నెల 19వ తేదీ జిల్లాలో 21 బుడ్డ శెనగల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. క్వింటాలుకు రూ. 5,875 చొప్పున మార్క్ ఫెడ్ ద్వారా రైతుల వద్ద నుంచి కొనుగోలు చేశారన్నారు.