జగన్ పర్యటనకు పోలీసుల ఆంక్షలు
AP: కృష్ణా జిల్లాలో మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఇవాళ వైఎస్ జగన్ పర్యటించనున్నారు. పంటలు దెబ్బతిన్న రైతులతో మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలో రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, SN గొల్లపాలెంలో మాత్రమే పర్యటించాలంటూ పోలీసులు షరతులు విధించారు. 500 మంది, 10 వాహనాలకు మాత్రమే అనుమతి, బైకులకు ఎలాంటి అనుమతి లేదంటూ ఆంక్షలు విధించారు. వైసీపీ నాయకులు రావొద్దని నోటీసులు ఇచ్చారు.