ముగిసిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం

ముగిసిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం

HYD: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ప్రచారం ఘనంగా ముగిసింది. గత కొన్ని రోజులుగా రోడ్‌ షోలు, సభలు, మీటింగ్స్‌, ఇంటింటి ప్రచారం ద్వారా నేతలు ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. బైపోల్‌ బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు నిలవగా.. ఎన్నికల కోసం 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు ఈసీ వెల్లడించింది. దీంతో గెలుపెవరిది అన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.