'ప్రజాస్వామ్యం కాపాడేది కాంగ్రెస్ మాత్రమే'
VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో “ఓటు చోర్, గద్దె చోడ్” సంతకాల సేకరణ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత ప్రియాంక దండి సోమవారం పాల్గొన్నారు. మోదీ హయాంలో ప్రజాస్వామ్యం క్షీణిస్తోందని ఆమె విమర్శించారు. ఎన్నికల సంఘం బీజేపీ చేతిలో ఉందని, ప్రజలు లేఖల ద్వారా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, విద్యార్థి సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.