ఇండియాలో తెలుగు సినిమా రికార్డ్
ప్రస్తుతం పలు మూవీలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. అందులో కొన్ని తెలుగు మూవీలు కాగా.. మరికొన్ని వేరే భాషలవి. అయితే 24 గంటల్లో 'రాజు వెడ్స్ రాంబాయి' మూవీ టికెట్లు 41.87Kపైగా అమ్ముడయ్యాయి. ఇండియా అంతటా నిన్న రిలీజైన సినిమాల్లో ఈ ఘనత సాధించిన మూవీగా ఇది రికార్డు సృష్టించింది. '120 బహదూర్'(36.71K) 'మస్తీ' మూవీ(34.71K), బుకింగ్స్‌తో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.