అదుపుతప్పిన ఆటో.. డ్రైవర్ మృతి

అదుపుతప్పిన ఆటో.. డ్రైవర్ మృతి

కృష్ణా: పమిడిముక్కల మండలం రెడ్డిపాలెం రామాలయం చెరువు వద్ద మంటాడ నుంచి వీరంకులాకు వెళుతున్న ఆటో అదుపు తప్పి సిగ్నల్ స్తంభాన్ని ఢీకొని చెరువులో పడిపోయింది. డ్రైవర్ దేశి నాగరాజు (50)కు అకస్మాత్తుగా అనారోగ్యం రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మహిళా ప్రయాణికులను స్థానికులు రక్షించి ఉయ్యూరు ఆసుపత్రికి తరలించారు.