'మహిళల ఆర్థిక అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం'

MBNR: మహిళల ఆర్థిక అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మహబూబ్‌నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ అనిత మధుసూదన్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో నిర్వహించిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు.