యాదవ కళ్యాణ మండపానికి స్థలం కేటాయించిన మంత్రి
SS: గోరంట్ల మండల యాదవ సంఘం దీర్ఘకాలిక విన్నపంపై రాష్ట్ర మంత్రి సవిత సానుకూలంగా స్పందించారు. కళ్యాణ మండప నిర్మాణం కోసం 47 సెంట్ల స్థలాన్ని కేటాయిస్తూ పత్రాలను పెనుకొండ ఆర్డీవో కార్యాలయంలో ప్రతినిధులకు అందజేశారు. బీసీల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.