నిర్మాణాలు కూల్చివేశారంటూ ఫిర్యాదు

KDP: సిద్ధవటం మండలంలోని ఉప్పరపల్లిలో తమ ఇంటి నిర్మాణాలను అన్యాయంగా కూల్చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ముస్లిం మహిళలు షరీఫ్, మహబును మంగళవారం తహసీల్దార్ మాధవిలతకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం స్లాబ్ వరకు నిర్మాణ పనులు జరిగాయన్నారు. ఉప్పరపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి దౌర్జన్యంగా ఇంటి నిర్మాణాలను JCBతో కూల్చి వేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.