VIDEO:పెరట్లో వికసించిన బ్రహ్మకమలాలు

VIDEO:పెరట్లో వికసించిన బ్రహ్మకమలాలు

కోనసీమ: కొత్తపేటకి చెందిన పురోహితుడు పెద్దింటి రామం ఇంటి పెరట్లో ఆదివారం అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఆయన పెంచుతున్న బ్రహ్మకమలం మొక్కకు ఒకేసారి ఏకంగా 100 పువ్వులు వికసించి చూపరులను మంత్రముగ్ధులను చేశాయి. హిమాలయాల్లో మాత్రమే కనిపించే ఈ పుష్పాలు మన ప్రాంతంలో పూయడం విశేషమని రామం హర్షం వ్యక్తం చేశారు. రాత్రివేళ వికసించి, సూర్యోదయానికి ముడుచుకుపోతాయన్నారు.