మహనీయుల ఆశయాలే మార్గదర్శకం: కలెక్టర్
SRPT: మహనీయుల ఆశయాలతోనే సామాజిక న్యాయం సాధ్యమని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో ‘తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం’ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుల సర్వే, ఉప వర్గీకరణ నిర్ణయాలు అట్టడుగు వర్గాలకు ఆత్మగౌరవం కలిగిస్తాయన్నారు. అనంతరం అధికారులతో కలిసి వివక్షకు వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ చేశారు.