కోతుల దాడిలో విద్యార్థినికి గాయాలు

SRCL: కోతుల దాడిలో పదో తరగతి విద్యార్థికి తీవ్ర గాయాలయిన ఘటన కోనరావుపేట మండలం బావుసాయిపేట ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న షేక్ రేష్మ అనే విద్యార్థినిపై ఇవాళ ఉదయం కోతి దాడి చేయగా తీవ్రంగా గాయపడింది. దీంతో గమనించిన ఉపాధ్యాయులు కోనరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు.