యాచకుడి హత్య కేసులో నిందితుడి అరెస్ట్

GNTR: యాచకుడి హత్య కేసులో నిందితుడు కొల్లి రాజేశ్‌ను తెనాలి త్రీ టౌన్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. సీఐ రమేశ్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 8వ తేదీన రైల్వే స్టేషన్ రోడ్డులోని సాయిబాబా గుడి వెనుక ప్రాంతంలో ఓ టింబర్ డిపో వద్ద వెంకట నారాయణ అనే యాచకుడు నిద్రిస్తుండగా రాజేశ్ అతడి గొంతు నులిమి హత్య చేసి రూ.3 వేలు నగదు లాక్కుని పరారయ్యాడు.