'పథకాల్లో ప్రజలను భాగస్వాములను చేయండి'
GDWL: జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల మధ్యకు తీసుకెళ్లి, ప్రజలను భాగస్వాములను చేయాలని తహశీల్దార్ శ్రీనివాస రావు తెలిపారు. స్థానిక సమస్యల గుర్తింపు, పథకాల అమలులో పూర్తి పారదర్శకత ఉండాలని కోరారు. రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియగా ఉందని, ఇప్పుడైనా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నందినివజ్ర, తదితరులు పాల్గొన్నారు.