మణికొండలో హైడ్రా దూకుడు..!

మణికొండలో హైడ్రా దూకుడు..!

HYD: మణికొండలో ఆక్రమణలపై హైడ్రా అధికారులు కొరడా ఝళిపించారు. సుమారు 1.5 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాకోరుల నుంచి కాపాడి, దాని చుట్టూ బోర్డులు పెట్టి స్వాధీనం చేసుకున్నారు. స్థానిక కాలనీ వాసుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన హైడ్రా బృందం, ఆక్రమణలను తొలగించి ప్రభుత్వ ఆస్తిని రక్షించింది. దీంతో స్థానికులు హైడ్రాకు కృతజ్ఞతలు తెలిపారు.