VIDEO: మార్కెట్ ఛైర్ పర్సన్ కుమారుడు మృతి
PDPL:పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ ఈర్ల స్వరూప సురేందర్ కుమారుడు విశ్వతేజ బుధవారం మృతి చెందారు. పెద్దపల్లి మున్సిపల్ పరిధి బంధంపల్లి శివారులోని వ్యవసాయ బావిలో పడి మృతి చెందినట్లు సమాచారం. ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.