ఎమ్మెల్యే గడ్డం వినోద్ నేటి పర్యటన వివరాలు
MNCL: బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ నేడు వేమనపల్లి మండలంలోని సూరారం, నాగారం గ్రామాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు సూరారంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం 10:30 గంటలకు నాగారం గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించి, లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేయనున్నారు.