'నాణ్యమైన విత్తనాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం'
MDK: నర్సాపూర్(M) ఆవంచ గ్రామంలో ఇవాళ 'నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం' అనే కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. ఇటీవల ప్రభుత్వం పంపిణీ చేసిన వరి విత్తనాల పంటలను వారు పరిశీలించారు. రైతులకు తోడ్పాటు అందించడం కోసం ప్రభుత్వం విత్తనాలు పంపిణీ చేసిందని, నాణ్యమైన విత్తనాలను అందజేయడమే ప్రభుత్వ లక్ష్యం అని అధికారులు అన్నారు.