ఎస్సీ హాస్టల్‌ను తనిఖీ చేసిన ఎంపీడీవో

CTR: వెదురుకుప్పం మండలం పచ్చికాపల్లం ఎస్సీ హాస్టల్‌ను శుక్రవారం ఉదయం ఎంపీడీవో పురుషోత్తం ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆహార మెనూ గురించి వార్డెన్ని అడిగి తెలుసుకున్నారు. అలాగే భోజనం సదుపాయాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారితో కలిసి టిఫిన్ చేసి, సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట సచివాలయ డీడీఓ వెంకటేశ్వర్లు, సిబ్బంది ఉన్నారు.