CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ASF: ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఆసిఫాబాద్, వాంకిడి, రెబ్బెన, కెరిమెరి మండలాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే కోవ లక్ష్మి తన నివాసంలో అందజేశారు. కష్టకాలంలో ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యేకు లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.