వృద్ధురాలిని ఢీకొన్న లారీ

వృద్ధురాలిని ఢీకొన్న లారీ

కృష్ణా: విజయవాడలో లారీ ఢీకొని వృద్ధురాలు మృతిచెందింది. కృష్ణలంక పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. కృష్ణలంకకు చెందిన షేక్ ఆషాబీ ఆకు కూరలు అమ్ముతూ జీవనం సాగిస్తుంది. ఈ క్రమంలో శుక్రవారం ఆకు కూరలు అమ్ముతుండగా లారీ ఢీకొని మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. కుమారుడు భాజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.